కరీంనగర్, సెప్టెంబర్ 6 (చైతన్యగళం): వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి స్వీయ పరిపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులు చిన్నారులుగా మారి ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ఉపాధ్యాయులకు వాలీబాల్, సంగీత కుర్చీ, స్పూన్ రేస్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పాటలు, నృత్యాలతో అలరించారు. అనంతరం విద్యాసంస్థల చైర్మన్, పదో డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య, డైరెక్టర్ సౌగాని రాజేశ్వరి ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించి, పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ సౌగాని కొమురయ్య మాట్లాడుతూ సమసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు అత్యున్నత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఏవో, హాస్టల్ ఇన్చార్జి గోపగోని మల్లేష్ గౌడ్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
