ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

కరీంనగర్, సెప్టెంబర్ 6 (చైతన్యగళం): వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి స్వీయ పరిపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులు చిన్నారులుగా మారి ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ఉపాధ్యాయులకు వాలీబాల్, సంగీత కుర్చీ, స్పూన్ రేస్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పాటలు, నృత్యాలతో అలరించారు. అనంతరం విద్యాసంస్థల చైర్మన్, పదో డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య,...