విద్యార్థుల సమగ్ర వికాసానికి ‘3సీ’ కార్యక్రమం
సంరక్షణ.. పరిరక్షణ.. కంప్యూటర్ పరిజ్ఞానం ఐదు ప్రభుత్వ పాఠశాలల దత్తత.. మూడేళ్లలో 600 మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం గండిపేట, సెప్టెంబర్ 1 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆధునిక సాంకేతిక ప్రపంచానికి సన్నద్ధం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించే లక్ష్యంతో జగతి ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘3సీ’ (కేర్–కన్జర్వ్–కంప్యూట్) సమగ్ర విద్యార్థి వికాస కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. హైదరాబాద్ గండిపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన...