దోమల దండయాత్ర.. అధికారుల నిద్రావస్థ!

వానలు వచ్చాయి.. దోమలు పెరిగాయి.. ఫాగింగ్‌ మాత్రం కనిపించడంలేదు! వీధి వీధినా దోమల మోత.. పట్టించుకునేవారే లేరా? నిల్వ నీరు కనిపిస్తున్నా చర్యలు శూన్యం.. పర్యవేక్షణ ఎక్కడ? వ్యాధులు విజృంభించిన తర్వాత మేల్కొంటారా? హైదరాబాద్‌: వర్షం పడింది. రోడ్ల పక్కన నీరు నిలిచింది. ఖాళీ స్థలాల్లో గుంతలు నిండాయి. నాలాలు, డ్రైనేజీల చుట్టూ మురుగు నీరు పేరుకుంది. రోజుల తరబడి అదే పరిస్థితి. ఇంతలో దోమలు పెరిగిపోయాయి. సాయంత్రం అయితే ఇళ్లలోకి దండయాత్ర. రాత్రయితే దోమల మోత. పిల్లలు, వృద్ధులు, కుటుంబాలతో బయట కూర్చోవాలన్నా...