కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్యగళం):
80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
