సిరిసిల్ల జిల్లా, ఆగస్టు 15 (చైతన్య గళం):
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, ఆత్మనిర్భరత వైపు వేగంగా ముందుకు సాగుతోందన్నారు. దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని, దేశభక్తి స్ఫూర్తితో ప్రజాసేవకు అంకితమై పనిచేయాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మ్యాన రాంప్రసాద్, కరీంనగర్ పార్లమెంట్ కో-ఇంచార్జి ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బర్కం లక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధులు నవీన్ యాదవ్, రాజాసింగ్, శీలం రాజు, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, జిల్లా కార్యాలయ ఇన్‌చార్జి శ్రీ భాగయ్య, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పూర్ణిమ, జిల్లా ఉపాధ్యక్షురాలు శోభ, సెన్సార్ బోర్డు సభ్యురాలు వైశాలి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ ఉరవకొండ రాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
