Friday, July 31, 2026
Homeతెలంగాణపొట్టి శ్రీరాములు చౌరస్తాలో నూతన హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన మేయర్ కొలగాని

పొట్టి శ్రీరాములు చౌరస్తాలో నూతన హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన మేయర్ కొలగాని

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 31 (చైతన్యగళం):
కరీంనగర్ నగరంలోని ప్రముఖ పొట్టి శ్రీరాములు చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, “నగరంలోని ప్రధాన కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు రాత్రి వేళల్లో వాహనదారులు, ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం కల్పించడమే లక్ష్యం. పట్టణ సౌందర్యీకరణతో పాటు రహదారి భద్రతను మెరుగుపరచడంలో ఆధునిక లైటింగ్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి” అని పేర్కొన్నారు.

నగరవ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులు, కూడళ్లలో దశలవారీగా ఆధునిక హైమాస్ట్, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పట్టణ వాతావరణాన్ని అందించడమే నగరపాలక సంస్థ ధ్యేయమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వంగల పవన్ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, నందకుమార్, స్థానిక నాయకులు గాజ శివరాం, ఎండి ముజీబ్, తనకు సాయి కృష్ణ, సొల్లు అజయ్ వర్మ, వరాల జ్యోతి, కైలాస నవీన్, కొడిత్యాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!