పొట్టి శ్రీరాములు చౌరస్తాలో నూతన హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన మేయర్ కొలగాని

కరీంనగర్, జూలై 31 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని ప్రముఖ పొట్టి శ్రీరాములు చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, “నగరంలోని ప్రధాన కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు రాత్రి వేళల్లో వాహనదారులు, ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం కల్పించడమే లక్ష్యం. పట్టణ సౌందర్యీకరణతో పాటు రహదారి భద్రతను మెరుగుపరచడంలో ఆధునిక లైటింగ్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి” అని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులు, కూడళ్లలో...