మజ్దూర్ యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఆవుల యుగంధర్ యాదవ్

వరంగల్(చైతన్యగళం): దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా వరంగల్ బ్రాంచ్ కార్యదర్శి ఆవుల యుగంధర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్ రావు, జోనల్ అధ్యక్షుడు శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజనల్ కార్యదర్శి రవీందర్ సంయుక్తంగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. యుగంధర్ యాదవ్ గత 14 సంవత్సరాలుగా మజ్దూర్ యూనియన్‌లో వివిధ హోదాల్లో చురుకుగా పనిచేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే గత ఆరు సంవత్సరాలుగా వరంగల్ బ్రాంచ్ కార్యదర్శిగా సమర్థవంతంగా...