Tuesday, October 13, 2026
Homeతెలంగాణపేదల కళ్లలో వెలుగే మా లక్ష్యం - సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి

పేదల కళ్లలో వెలుగే మా లక్ష్యం – సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

  • కంటి వైద్యం అందక ఎవరూ ఇబ్బంది పడకూడదు.. సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తాం

 

ఆమనగల్లు, సెప్టెంబర్‌ 20 (చైతన్యగళం‌):
కంటి సమస్యలతో బాధపడే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించి వారి జీవితాల్లో వెలుగు నింపడమే తమ లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్‌ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. కడ్తాల్‌లోని ఎంబీఏ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన ఆరో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక స్థోమత లేక కంటి వైద్యం పొందలేని వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెల్దండలో ప్రారంభమైన సేవా ప్రయాణం ఆమనగల్లు, కల్వకుర్తి, మాడ్గుల, తలకొండపల్లి మీదుగా కడ్తాల్‌ వరకు కొనసాగిందన్నారు. ఆరు శిబిరాల్లో 19,791 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించగా, 15,497 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు అందించామని, 876 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వివరించారు. కడ్తాల్‌ శిబిరంలో 3,591 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 2,422 మందికి ఉచిత కంటి అద్దాలు అందించామని, కంటి శుక్లాలతో బాధపడుతున్న 154 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. శంకర నేత్రాలయ వైద్యుడు డాక్టర్‌ విష్ణు భరత్‌, సూపర్‌వైజర్‌ భానుప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్‌ దాస్‌ నాయక్‌ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఐక్యత ఫౌండేషన్‌ సభ్యులు తల్లోజు రఘు, ఎగిరిశెట్టి లింగం, రాచ సీతారాములు, నరేందర్‌గౌడ్‌, చంద్రశేఖర్‌, జగన్‌, కొండల్‌యాదవ్‌, రమేష్‌యాదవ్‌, మల్లేష్‌, శ్రీపతి, శేఖర్‌, మల్లేష్‌నాయక్‌, శ్రీను, మహేష్‌ తదితరులు శిబిరం నిర్వహణలో సేవలందించారు. కంటి శిబిరాలు పూర్తయినా సేవా కార్యక్రమాలు ఆగవని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లో సేవలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!