వరద సహాయక చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, జూలై 30(చైతన్యగళం): గోదావరిఖని, పెద్దపల్లి, రామగుండం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సహాయక, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, ఎన్‌టీపీసీ, తెలంగాణ జెన్‌కో, ఆర్‌ఎఫ్‌సీఎల్, రామగుండం పోలీసు కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు....