- స్థాయికి మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు
- మర్రిపెడలో ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రవి రాథోడ్
మహబూబాబాద్, జూలై 29(చైతన్యగళం): ఆర్ఎంపీలు నిబంధనలకు లోబడి కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ సూచించారు. బుధవారం మర్రిపెడ మండలంలోని కంపాటి రవిబాబు ఆర్ఎంపీ ప్రజా క్లినిక్‌ను ఆయన తనిఖీ చేసి సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు తమ పరిధికి మించి వైద్య సేవలు అందించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంజక్షన్లు, సెలైన్లు వంటి వైద్య సేవలను నిబంధనలకు విరుద్ధంగా అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ప్రథమ చికిత్స అందించే ఆర్ఎంపీలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మనోహర్, కృష్ణ పాల్గొన్నారు.
