మృగత్వాన్ని పెంచుతున్న ‘అతి’ ప్రేమ.. మనిషిని మానసిక రోగిగా మారుస్తున్న నేటి సమాజం
నాడు చందమామను చూపిస్తూ ముద్దలు తినిపించిన తల్లి చేతులు నేడు పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తున్నాయి. నాడు తప్పు చేస్తే మందలించే తండ్రి నేడు పిల్లల అనాగరిక పనులను కూడా వెనకేసుకొస్తున్నాడు. ఫలితం? సమాజంలో విచక్షణ కోల్పోతున్న మనుషులు పెరుగుతున్న నేరాలు పతనమవుతున్న నైతిక విలువలు. మనిషి తనలోని ఇంగితాన్ని మరిచి మానసిక కల్లోలానికి లోనవుతూ మానసిక రోగి గా మారుతున్నాడనడానికి నిత్యం పేపర్లలో చూసే ఘోరాలే సాక్ష్యం. దీనికి అసలు కారణం ఎక్కడ ఉంది? వ్యవస్థదా? విద్యాసంస్థలదా? అంటే. ముమ్మాటికీ పునాది పడాల్సిన...