కరీంనగర్, జూలై 28 (చైతన్యగళం):
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం 5 గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని డిసిసి అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ గిరి ప్రదక్షిణలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 4:30 గంటలకు ఆయన తీగలగుట్టపల్లిలోని విల్లా నుంచి కొండగట్టుకు బయలుదేరి వెళ్లనున్నారు.
సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ గిరి ప్రదక్షిణలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అభ్యర్థులు, సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
