నందికొట్కూరు, జూలై 27 (చైతన్యగళం):
నందికొట్కూరు పట్టణంలోని ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో దూదేకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎస్. ఖాజీ జన్మదిన వేడుక సందర్భంగా ఆర్.ఆర్. బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్.ఎస్. ఖాజీ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ సేవా తత్వంతో సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలి. ముఖ్యంగా రక్తదానం ఒక ప్రాణికి ప్రాణదానం చేసిన పుణ్యం కలిగిస్తుంది. యువత సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి” అని పిలుపునిచ్చారు.
శిబిరంలో దూదేకుల సంఘం నాయకులు, సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఆర్.ఆర్. బ్లడ్ బ్యాంక్ వైద్య బృందం రక్తాన్ని సేకరించి రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేసింది. ఈ కార్యక్రమంలో సంఘ గురువులు, పెద్దలు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
