దూదేకుల సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

నందికొట్కూరు, జూలై 27 (చైతన్యగళం): నందికొట్కూరు పట్టణంలోని ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో దూదేకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎస్. ఖాజీ జన్మదిన వేడుక సందర్భంగా ఆర్.ఆర్. బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఎస్. ఖాజీ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ సేవా తత్వంతో సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలి. ముఖ్యంగా రక్తదానం ఒక ప్రాణికి ప్రాణదానం చేసిన పుణ్యం కలిగిస్తుంది. యువత సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి” అని పిలుపునిచ్చారు. శిబిరంలో దూదేకుల సంఘం...