Tuesday, July 28, 2026
Homeతెలంగాణఎల్ నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి - ఏఎంసీ వైస్ చెర్మన్ సాదుల పవన్...

ఎల్ నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి – ఏఎంసీ వైస్ చెర్మన్ సాదుల పవన్ కుమార్

📰 Generate e-Paper Clip

నంగునూర్, జులై 27(చైతన్యగళం):

నంగునూరు రైతు వేదికలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఏర్పాటు చేసిన విత్తనల మేళాను నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్,సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందని అందువల్ల రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు అన్నారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే వినియోగించాలని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే దిగుబడులు మెరుగుపడతాయని అన్నారు. తక్కువ నీటితో, తక్కువ కాలంలో పండే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నంగునూరు మండల రైతులు, విత్తన డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!