నల్లగొండ, జూలై 25 (చైతన్యగళం):
తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 4న హైదరాబాదులోని కర్నాటి గార్డెన్స్లో రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులకు అవగాహన సదస్సు జరగనుంది. ఈ సదస్సు విజయవంతం కావాలని కోరుతూ చర్లపల్లి చేనేత సహకార సంఘం భవనంలో శనివారం జరిగిన సమావేశంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ మాట్లాడుతూ, “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే తెలంగాణ చేనేత కార్మిక సంఘం చేనేత పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరాయంగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తోంది. 2013 తర్వాత ఎన్నికలు జరగకపోవడంతో అనేక పోరాటాల అనంతరం 2026 జూలైలో ఎన్నికలు జరగడం చేనేత రంగానికి కొత్త ఊపునిచ్చింది” అని అన్నారు.నూతన పాలకవర్గ సభ్యులకు సహకార సంఘాల బలోపేతం, కార్మికుల సంక్షేమం, చట్టాలపై అవగాహన కల్పించేందుకు సీనియర్ రిటైర్డ్ అధికారి మూనాస వెంకటేశం, రిటైర్డ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక బోధన అందించనున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన అధ్యక్షులు, సభ్యులు హాజరై సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు.సమావేశ అనంతరం నూతన పాలకవర్గ సభ్యులకు అభినందన సభ నిర్వహించి మెమెంటోలు అందజేశారు. చర్లపల్లి పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఆగస్టు 4న జరగనున్న సభాకార పత్రాన్ని ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో చేనేత సంఘం అధ్యక్షుడు ముషం రవి, ఉపాధ్యక్షులు గంజి రమేష్, కార్యదర్శి గంజి రమేష్,కోశాధికారి రాపోలు శేషమ్మ, డైరెక్టర్లు రాపోలు గణేష్, చిట్టిపోలు రమేష్, కటకం వెంకటేశ్వర్లు, రాపోలు బిక్షం, గంజి వెంకమ్మ, పవర్ లూమ్ వీవర్ రాపోలు శ్రీను, మేనేజర్ దేవలపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
