చర్లపల్లిలో చేనేత సహకార సంఘాల అవగాహన సదస్సు కరపత్రం ఆవిష్కరణ
నల్లగొండ, జూలై 25 (చైతన్యగళం): తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 4న హైదరాబాదులోని కర్నాటి గార్డెన్స్లో రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులకు అవగాహన సదస్సు జరగనుంది. ఈ సదస్సు విజయవంతం కావాలని కోరుతూ చర్లపల్లి చేనేత సహకార సంఘం భవనంలో శనివారం జరిగిన సమావేశంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ మాట్లాడుతూ, “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే తెలంగాణ చేనేత కార్మిక సంఘం చేనేత పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరాయంగా...