చర్లపల్లి చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
నల్లగొండ, జూలై 25 (చైతన్యగళం): నల్గొండ పట్టణ పరిధిలోని చర్లపల్లి చేనేత సహకార సంఘం లిమిటెడ్ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “చేనేత కళ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, మన అస్తిత్వానికి ప్రాణవాయువు లాంటిది. కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి నేసే అద్భుతమైన వస్త్రాలు మన రాష్ట్రానికి దేశస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి”...