రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు

సమయస్ఫూర్తితో స్పందించిన రూరల్ సీఐ అంజలి, పోలీసు సిబ్బంది మహబూబాబాద్, జూలై 22(చైతన్యగళం): రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, ఎస్సై సుదర్శన్, బ్లూకోల్ట్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. బుధవారం తెల్లవారు జామున 2 గంటల44 నిమిషాల సమయంలో మహబూబాబాద్ రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు డీజీ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందింది. వెంటనే రూరల్ సీఐ అంజలి వైర్‌లెస్ ద్వారా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటనా...