Wednesday, September 23, 2026
Homeరాజకీయంకౌన్సిలర్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆయిల్‌ షఫీ వినతి

కౌన్సిలర్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆయిల్‌ షఫీ వినతి

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు, సెప్టెంబరు 22 (చైతన్యగళం):

నందికొట్కూరు పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఆయిల్‌ షఫీ కోరారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆయిల్‌ షఫీ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీపై తనకు ఉన్న అభిమానంతో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. 5వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.

పార్టీ అవకాశం కల్పిస్తే వార్డులో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయిల్‌ షఫీ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!