కరీంనగర్‌లో కాంగ్రెస్–బీజేపీ ఘర్షణ

బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత కరీంనగర్, జూలై 22 (చైతన్యగళం‌): కరీంనగర్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనల ప్రభావంతో, కరీంనగర్‌లోనూ కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. కార్యాలయం వైపు దూసుకొచ్చిన కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, నినాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు....