బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే ధన్‌పాల్

నిజామాబాద్, జూలై 19 (చైతన్య గళం):  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని కోటగల్లిలోని కట్ట మైసమ్మ ఆలయం, నాందేవ్‌వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఆషాఢ మాసం తెలంగాణ ప్రజలకు అత్యంత పవిత్రమైనదని, గ్రామదేవతలను ఆరాధిస్తూ మంచి వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునే పండుగే బోనాలని పేర్కొన్నారు....