- బోర్డు నిధులు కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలి.
- లేబర్ కోడ్స్ రద్దు చేయాలి:సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం
నల్లగొండ,జులై 20 (చైతన్యగళం): భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ తెచ్చిన జీవో నెంబర్ 12 ను ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగించాలి. కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని, సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని, సిఎస్ సి హెల్త్ టెస్టులు ను రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నలగొండ సుందరయ్య సెంట్రింగ్ ఆఫీస్ నుంచి డిసిఎల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం ప్రజా పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్న పట్టించుకోవడంలేదని విమర్శించారు.భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం,శాశ్విత,పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ 346.36 కోట్ల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు.సిఎస్ సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లక్షలాది మంది నిర్మాణ రంగా కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డ సంపదను కార్మికుల సంక్షేమాన్ని కాకుండా ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం అన్యాయమని విమర్శించారు.అవసరం ఉన్నా లేకున్నా ప్రతి కార్మికుడు పేరు మీద 2వేల 309 ప్రీమియం చెల్లిస్తూ పోతే బోర్డు నిధులు రోజురోజుకు తరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సిఎస్ సి హెల్త్ చెకప్ పేరుతో 750 కోట్లు కాజేశారని అన్నారు. కార్మికులకు మాత్రం ఇవ్వాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించి తీరిక ప్రభుత్వానికి అధికారులకు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణరంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, గడువు దాటిన 13 లక్షల కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేసే కుట్రలు అపకపోతే పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సమీకరించి పోరాడుతామని హెచ్చరించారు.
ఈ ధర్నాను ఉద్దేశించి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చిన్న పాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమం కోసం కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు వందల కోట్లు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో 28 లక్షల మంది వెల్ఫేర్ బోర్డులో పేర్లు నమోదు చేయించుకుంటే 15 లక్షల మంది కార్డులు మాత్రమే రెన్యువల్ చేసి మిగతా 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కు సంక్షేమ పథకాలు అందకుండా వారి కడుపులు కొడుతున్నారు. 55 సంవత్సరాలు వయసు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని పిల్లల చదువులకు స్కాలర్ షిప్స్ ఇవ్వాలని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే హైదరాబాద్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, ఏర్పుల యాదయ్య,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అవుట రవీందర్,జిల్లా నాయకులు ఎస్ సైదాచారి,పోలే సత్యనారాయణ, బి దయానంద్ ,వరికుప్పల ముత్యాలు, వడ్డేపల్లి శంకర్,బి సైదులు, రేవెల్లి యాదయ్య, మంద రాజు, ఎస్.కె హుస్సేన్,గోవిందు వెంకన్న. శ్రీ సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు. నోముల యాదయ్య. దేవరపల్లి వెంకట్ రెడ్డి.బచ్చలకూరి గురువయ్య.పాక లింగయ్య మన్నె శంకర్ దేవరపల్లి వెంకట్ రెడ్డి. తాపీ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ కమిటీ నాయకులు. సాగర్ల మల్లయ్య జేరిపోతుల యాదయ్య తాలూకా ఎంకన్న. రాడ్ బెండింగ్ నాయకులు. తవ్డోజు నాగాచారి మేడిశెట్టి సతీష్. పెయింటింగ్ వర్కర్స్ పట్టణ నాయకులు. అధ్యక్ష కార్యదర్శులు. భీమనపల్లి శంకర్. పిడమర్తి శంకర్.లిఫ్ట్ వర్కర్స్ నాయకులు. గుంజ లక్ష్మణ్. వల్లపు సైదరాజు. తమ్మిశెట్టి కృష్ణ. సుంకర బోయిన రవి. కట్ట గోవర్ధన్. కట్ట శీను.తదితరులు పాల్గొన్నారు.
