- ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం
- నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన రోటరీ క్లబ్‌ల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు,పలువురు ప్రముఖులు
వరంగల్,జులై 20(చైతన్యగళం):వరంగల్ హంటర్ రోడ్‌లోని పీఆర్‌ఆర్ వేడుకల మందిరంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ 38వ అధ్యక్షుడిగా సోమ వేణుగోపాల్, కార్యదర్శిగా నాయిని అనిల్ కుమార్, కోశాధికారిగా జూలూరి కృష్ణమూర్తి ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్బంగా అధ్యక్షుడు మాట్లాడుతూ సంవత్సర కాలానికి నా వంతుగా పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా దాత నాయిని ఫౌండేషన్ చైర్మన్ నాయిని అనిల్ కుమార్ ఐదు కుట్టు మిషన్లు అందజేశారు.అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు,ములుగు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు రెండు బీరువాలను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాబోయే రోటరీ గవర్నర్ ఎం.హరిహర ప్రసాద్, డా.సీ.శరత్ బాబు హాజరై మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో రోటరీ సంస్థ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. రోటరీ సభ్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వెచ్చిస్తూ పేదలకు కుట్టు మిషన్లు, ప్రభుత్వ పాఠశాలలకు సైకిళ్లు, వాటర్ ప్లాంట్లు, అనాథాశ్రమాలకు మంచాలు, నిత్యావసర వస్తువులు అందిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రోటరీ కీలక పాత్ర పోషిస్తూ విశేష సేవలు అందిస్తోందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్ సభ్యులు ఏజీ పోరండ్ల రత్నాకర్ రావు, మాడూరి గణేష్, భేతి అశోక్ బాబు, తోట సంపత్, శ్రీకర్, వినయ్ ప్రసాద్, కోరే చంద్రమౌళి, పొన్న హరినాథ్, బండారు కుమారస్వామి, మొగిలి చంద్రతో పాటు హనుమకొండ, వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్ రోటరీ క్లబ్‌ల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
