Tuesday, July 21, 2026
Homeతెలంగాణసిద్ధిపేటహుస్నాబాద్ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హుస్నాబాద్ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, జూలై 19 (చైతన్య గళం): 

హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్, గణితశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఒక్కో గెస్ట్ లెక్చరర్ పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి తెలిపారు.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఎస్సీ ఎస్టీలకు 50 శాతం ఓసి బీసీలకు 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతో పాటు నెట్ సెట్ పీ హెచ్ డీ ఏదైనా ఒక అర్హత కలిగి ఉండాలన్నారు తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి బోధన అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు

ఆసక్తి గల అభ్యర్థులు జూలై 21 సాయంత్రం 4 గంటలలోపు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు సమర్పించాలని కోరారు.

అందిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన అభ్యర్థులను డెమో ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తామని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!