Sunday, July 19, 2026
Homeఆంధ్రప్రదేశ్భారత్ మరిన్ని విజయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: సీఎం చంద్రబాబు

భారత్ మరిన్ని విజయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్, ఎన్ఎస్ఐఎల్‌లకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు.

అమరావతి, జులై 18(చైతన్యగళం): విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్, ఎన్ఎస్ఐఎల్‌లకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. విక్రమ్-1 తొలి ప్రయోగంలోనే విజయవంతంగా కక్ష్యలోకి చేరడంతో భారత్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించిందన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోటీపడే స్థాయికి భారత ప్రైవేటు అంతరిక్ష రంగం ఎదిగిందని ఈ విజయం నిరూపించిందని వెల్లడించారు. ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక నూతన యుగానికి నాంది అని పేర్కొన్నారు.

శాస్త్రీయ సంస్థల సామర్థ్యం, భారతీయ పారిశ్రామికవేత్తల సృజనాత్మకత కలిసినప్పుడు ఆవిష్కరణలకు కొత్త హద్దులు ఏర్పడతాయని ఈ ఘన విజయం చాటిచెప్పిందని సీఎం తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్, ఎన్ఎస్ఐఎల్ సహా ఈ విజయాన్ని సాకారం చేసిన వేలాదిమంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, భాగస్వామ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వపడే క్షణమని, భావితరాల యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. నక్షత్రాల వైపుగా భారత్ సాగిస్తున్న ప్రస్థానం మరిన్ని విజయాలతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!