Thursday, August 20, 2026
Homeతెలంగాణయువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – సర్పంచ్ తిరుపతియాదవ్

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – సర్పంచ్ తిరుపతియాదవ్

📰 Generate e-Paper Clip

ఎలిగేడు, జూలై 16 (చైతన్యగళం):
ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామంలో యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి పెంచాలని సర్పంచ్ సిద్ధి తిరుపతియాదవ్ పిలుపునిచ్చారు.గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఆయన స్వంత ఖర్చుతో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసి, క్రీడా పరికరాలను సమకూర్చారు.ఈ సందర్భంగా తిరుపతియాదవ్ మాట్లాడుతూ, “క్రీడలు ఆడటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు దోహదపడతాయి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తీట్ల విద్యాలత‑విజయ్, వార్డు సభ్యులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!