Sunday, July 26, 2026
Homeతెలంగాణకరీంనగర్ఆకస్మిక దాడితో ఆరుగురు జూదరుల అరెస్ట్

ఆకస్మిక దాడితో ఆరుగురు జూదరుల అరెస్ట్

📰 Generate e-Paper Clip

కరీంనగర్ , జూలై 16 (చైతన్యగళం):

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గంగాధర మండలం ఎల్లమ్మ తొవ్వ ప్రాంతంలో జూదం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు జూదరులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.52,380 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన నిందితులు లింగాల రాజు (35), బొంగోని సంతోష్ (43), బండారి భరత్ (30), కొడూరి గంగరాజు (36), పుల్లెల సంతోష్ (38), ఎనుగుల రాజమల్లు (43)గా పోలీసులు తెలిపారు.

నిందితులపై తెలంగాణ గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ దాడిని ఆర్‌ఎస్‌ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుళ్లు వెంకట్, తిరుపతి, రాజయ్య సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూదం, పేకాటతో పాటు ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!