ఆకస్మిక దాడితో ఆరుగురు జూదరుల అరెస్ట్
కరీంనగర్ , జూలై 16 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గంగాధర మండలం ఎల్లమ్మ తొవ్వ ప్రాంతంలో జూదం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు జూదరులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.52,380 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు లింగాల రాజు (35), బొంగోని సంతోష్ (43), బండారి భరత్ (30), కొడూరి గంగరాజు (36), పుల్లెల సంతోష్ (38), ఎనుగుల రాజమల్లు (43)గా పోలీసులు తెలిపారు....