Thursday, July 16, 2026
Homeతెలంగాణకాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ - మల్ రెడ్డి రంగారెడ్డి

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ – మల్ రెడ్డి రంగారెడ్డి

📰 Generate e-Paper Clip

  • గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
  • మంచాల మండలంలో రూ.9 కోట్లతో రంగాపూర్ నుండి మాల్ వరకు బిటి రోడ్డుకు శంకుస్థాపన

ఇబ్రహింపట్నం, జూలై 15 (చైతన్యగళం) : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని గ్రామాల్లో రోడ్లు అద్దాల్లా కన్పిస్తున్నాయని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండలంలోని రంగాపూర్ నుండి చీదేడు దాద్ పల్లి నల్లవెల్లి గ్రామాల మీదుగా మాల్ వరకు వెళ్లే బిటి రోడ్డుకు రూ.9కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏనాడూ లేని విధంగా గ్రామాల్లో వందల కోట్ల రూపాయలతో బిటిరోడ్లు మరియు మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్నట్ల తెలిపారు. తాజాగా రూ. 9కోట్ల రూపాయలతో మంచాల మండలంలోని రంగాపూర్ నుండి చీదేడు దాద్ పల్లి నుండి మాల్ వరకు బిటి రోడ్డు వేయిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ప్రజలకు రవాణా సౌకర్యం సులభతరం అవుతుందని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు వేస్తూ రాష్ట్రంలో నియోజకవర్గంను ముందువరుసలో ఉంచడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, భూపతిగల్ల మహిపాల్ , ఈసి శేఖర్ గౌడ్ ,ఎదుల్ల పాండురంగా రెడ్డి , మంచాల సహకార సంఘం చైర్మన్ వెదిరే హనుమంత్ రెడ్డి, మంకాల కరుణాకర్, సర్పంచ్ లు నేనావత్ బాలకృష్ణ , గునుకుల పరమేశ్వరి , తిరుమలేష్ , నేనావత్ శాంతి , రాజునాయక్ , సపావత్ కిషన్ నాయక్ , తోట్ట రమేష్ , బెల్లి అశోక్ , మంతని శివ యాదవ్ , మంచాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎడమ నరేందర్ రెడ్డి , డీసీసీ అధికార ప్రతినిధి బైరిక రమాకాంత్ రెడ్డి, మంచాల మండల మాజీ ఎంపిపి గుండమోని జయమ్మ మల్లేష్ , వింజమూరి రాంరెడ్డి, వింజమూరి ప్రేమాకర్ రెడ్డి, చీమల జంగయ్య యాదవ్, జెనిగ వెంకటేష్ యాదవ్, సపావట్ శ్రీధర్ నాయక్, జిలమోని సత్తయ్య , గుడ్డిమల్ల చంద్రయ్య , మార సురేష్, రాజునాయక్ , కోటి రాథోడ్, కొంకని విజయ్ , కందకట్ల జైపాల్ రెడ్డి , ఎర్పుల రాజు , రావుల రాఘవ , చేతాళ్ళ సతీష్, భరత్ రెడ్డి , సింగారం సుమన్ , దేవరకొండ రామకృష్ణ , గిన్నె మహేందర్, స్వామి నాయక్ , పంతంగి ప్రశాంత్ , పాండాల శ్రీనివాస్ , కోరె బాబు, కంబాలపల్లి బుగ్గరాములు , కాట్రోత్ మధు , ఎండి అశ్రఫ్ , గొరిగే కృష్ణ , దూసరి రాజు , ప్రభాకర్ , మరియు అధికారులు మంచాల మండలం ఎమ్మార్వో ప్రసాదరావు ఎండివో వసంతలక్ష్మి పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!