వెల్దండ, జూలై 14 (చైతన్యగళం): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెల్దండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు సమర్పించారు.ఈ సందర్భంగా పుట్ట రామ్ రెడ్డి మాట్లాడుతూ, “రైతులను హింసకు ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసిగొలిపేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలు, రైతుల రక్తాన్ని పొలాల్లో చిందించాలనే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు. బండరాయి కట్టుకొని ప్రాజెక్టులో దూకాలని చెప్పడం ఆత్మహత్యకు ప్రేరేపించడం అవుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ విమర్శల కిందకు రావు, ముమ్మాటికీ నేరం” అని ఆరోపించారు.భారతీయ అన్యాయ సహిత 2023 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సీఎం పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి విజితా రెడ్డి, మాజీ ఎంపిటిసి జ్యోతి నిరంజన్, మాజీ సర్పంచ్ అరుణ ప్రభాకర్, ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్, పోతేపల్లి సర్పంచ్ కొండల్ యాదవ్, మాజీ ఎంపిటిసి నాగుల నాయక్, మాజీ ఎంపిటిసి లింగం, మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, పోలే అశోక్, జంగిలి ప్రవీణ్, జంగిలి దాస్, శ్రావణ్ కుమార్, భాస్కర్, రాజు, గణేష్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రమౌళి, మల్లేష్, ఎం.డి. అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
