సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వెల్దండలో బిఆర్ఎస్ ఫిర్యాదు
వెల్దండ, జూలై 14 (చైతన్యగళం): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెల్దండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు సమర్పించారు.ఈ సందర్భంగా పుట్ట రామ్ రెడ్డి మాట్లాడుతూ, “రైతులను హింసకు ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసిగొలిపేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలు, రైతుల రక్తాన్ని పొలాల్లో చిందించాలనే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు. బండరాయి కట్టుకొని ప్రాజెక్టులో...