ఓటర్ నమోదు ప్రక్రియను పర్యవేక్షించిన తల్లోజు ఆచారి

కల్వకుర్తి, జూలై 13 (చైతన్యగళం): కల్వకుర్తి మండలంలోని కురుమిద్ధ, మార్చాల, జీడిపల్లి, తోటపల్లి, వేపూరు, గుండూరు, సుద్ధకల్ గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి సోమవారం బిఎల్ఏ ఏజెంట్లు, పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. బిఎల్ఏ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు నమోదు చేసి, ఓటు హక్కు పరిరక్షణలో...