మంచాల, జూలై 6 (చైతన్యగళం): మంచాల మండల బీజేపీ కార్యాలయంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు, మహోన్నత జాతీయవాది, విద్యావేత్త డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాయకులు మాట్లాడుతూ దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం డాక్టర్ ముఖర్జీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, ఆయన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మారగోని శ్రీశైలం, చివురల పాండు, వెదిరే జగదీశ్వర్ రెడ్డి, జక్కా హరీష్, గడ్డం రాజేందర్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచాంద్, నాని శివ పాల్గొన్నారు.
