Tuesday, August 25, 2026
Homeతెలంగాణరోశయ్య సేవలు చిరస్మరణీయం – గణేష్ బిగాల

రోశయ్య సేవలు చిరస్మరణీయం – గణేష్ బిగాల

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ జూలై 4 (చైతన్యగళం) : స్వర్గీయ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ… ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి స్వర్గీయ రోశయ్య ఆదర్శప్రాయమైన నాయకుడని అన్నారు.

ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, వివిధ శాఖల్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా సేవలందించిన ఘనత రోశయ్య దేనని కొనియాడారు. రాజకీయాలకు విలువలు తీసుకొచ్చిన నాయకుడిగా, పరిపాలనలో తనదైన ముద్ర వేసిన మహానీయుడిగా ఆయన ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు పొన్నం ప్రభాకర్ , గడ్డం వివేక్ ,నాయకులు కె.వి.పి. రామచందర్ రావు,ఎమ్మెల్యే గడ్డం వినోద్ ,ఎమ్మెల్యే దానం నాగేందర్ , వైశ్య కార్పొరేషన్ చైర్మెన్ కల్వ సుజాత , కోలేటి దామోదర్ ,తెలంగాణా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఉప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!