రోశయ్య సేవలు చిరస్మరణీయం – గణేష్ బిగాల
హైదరాబాద్ జూలై 4 (చైతన్యగళం) : స్వర్గీయ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ... ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి స్వర్గీయ రోశయ్య ఆదర్శప్రాయమైన నాయకుడని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, వివిధ శాఖల్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా సేవలందించిన ఘనత...