Tuesday, July 7, 2026
Homeతెలంగాణఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఒడితల ప్రణవ్

ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఒడితల ప్రణవ్

📰 Generate e-Paper Clip

హుజురాబాద్, జూలై 3 (చైతన్యగళం): హుజురాబాద్ పట్టణంలోని 14, 17వ వార్డుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితల ప్రణవ్ ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల వివరాలు సరిచూసి, సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి పౌరుడు తన ఓటు హక్కును కాపాడుకోవాలి. బిఎల్ఓ, బిఎల్ఏలను సంప్రదించి సరైన వివరాలు నమోదు చేయాలి. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో జరిగినట్టు ఇక్కడ కూడా ఓట్ల తొలగింపు జరగకుండా జాగ్రత్త పడాలి” అని సూచించారు.అదేవిధంగా, “కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు ప్రజల కళ్లముందే కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉచిత బస్ ప్రయాణం, రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, మహిళలకు వడ్డీలేని రుణాలు—ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే అందిస్తోంది” అని వివరించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్ కోఆర్డినేటర్, పట్టణ, మండల అధ్యక్షులు, వార్డ్ కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!