Wednesday, July 1, 2026
Homeతెలంగాణరంగారెడ్డిశేరిగూడ ZPHSలో ఘనంగా కళాతోరణం ప్రారంభం

శేరిగూడ ZPHSలో ఘనంగా కళాతోరణం ప్రారంభం

📰 Generate e-Paper Clip

శేరిగూడ, జూలై 1 (చైతన్యగళం): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కళాతోరణం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఫౌండేషన్ సొంత నిధులతో సుమారు రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ కళాతోరణాన్ని ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి ప్రారంభించి పాఠశాల యాజమాన్యానికి అందజేశారు.

పాఠశాల ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 32 అడుగులు × 36 అడుగుల విస్తీర్ణంలో కళాతోరణాన్ని నిర్మించారు. పైకప్పు, నేల భాగాలకు నాణ్యమైన టైల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు, సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

అనంతరం పాఠశాల ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతో ఉపయోగకరమని ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!