శేరిగూడ ZPHSలో ఘనంగా కళాతోరణం ప్రారంభం

శేరిగూడ, జూలై 1 (చైతన్యగళం): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కళాతోరణం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఫౌండేషన్ సొంత నిధులతో సుమారు రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ కళాతోరణాన్ని ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి ప్రారంభించి పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. పాఠశాల ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 32 అడుగులు × 36 అడుగుల విస్తీర్ణంలో కళాతోరణాన్ని నిర్మించారు. పైకప్పు, నేల భాగాలకు నాణ్యమైన టైల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు, సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు....