రాజన్న సిరిసిల్లలో ఘనంగా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్
రాజన్న సిరిసిల్ల, జూన్ 23 (చైతన్య గళం): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, గొప్ప జాతీయవాది, దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని అర్పించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ ఏకత్వం, అఖండత కోసం డాక్టర్ ముఖర్జీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, ఆయన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన...