Tuesday, June 23, 2026
Homeతెలంగాణమల్లన్న స్వామి దేవాలయంలో భక్తుల సందడి

మల్లన్న స్వామి దేవాలయంలో భక్తుల సందడి

📰 Generate e-Paper Clip

అమావాస్య సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు

మెదక్ , జూన్ 15 (చైతన్యగళం): అమావాస్య సందర్భంగా కొయ్యగుట్ట మల్లన్న స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

మెదక్ జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, రేగోడ్, పెద్దనర్సాపూర్, గోపాల్‌పేట్, ఎల్లారెడ్డి, మెదక్ పట్టణం తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రతి సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వేలాదిగా భక్తులు చేరుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

“తమ కోరికలు నెరవేరుతాయనే అచంచల విశ్వాసంతో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయంగా ఉన్న ఈ దేవాలయం రోజురోజుకు భక్తుల ఆదరణను పొందుతోంది” అని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!