Thursday, June 11, 2026
Homeతెలంగాణసమస్యల పరిష్కారానికే వార్డు సభలు - మున్సిపల్ ఛైర్మన్ పత్యనాయక్

సమస్యల పరిష్కారానికే వార్డు సభలు – మున్సిపల్ ఛైర్మన్ పత్యనాయక్

📰 Generate e-Paper Clip

ఆమనగల్లు, జూన్ 10 (చైతన్యగళం):
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు వార్డు సభలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని 8వ వార్డు సంకటోనిపల్లిలో సభ జరిగింది.ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజలతో సమీపంగా ఉండి వారి సమస్యలను పరిష్కరించడం మున్సిపల్ పాలనలో ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ తల్లోజు గీత ఆచారి, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, కౌన్సిలర్ ఎనుమల్ల రమేష్, నాయకులు కమటం వెంకటయ్య, శ్రీపాల్, ధనుంజయ, దేవరశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!