పెద్దపల్లి, జూలై 21 (చైతన్యగళం):
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) మంచిర్యాల్ నియోజకవర్గంలోని లక్షేపేటలో నిర్వహించిన రైతు సదస్సుకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివెళ్లారు.
ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యం వహించారు. ఆయన మాట్లాడుతూ, “రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ బలంగా వినిపిస్తోంది. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారు” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.
