Wednesday, July 22, 2026
Homeతెలంగాణసర్ ప్రక్రియపై దుద్దిళ్ల శ్రీను బాబు దిశానిర్దేశం

సర్ ప్రక్రియపై దుద్దిళ్ల శ్రీను బాబు దిశానిర్దేశం

📰 Generate e-Paper Clip

మంథని, జూలై 20 (చైతన్యగళం‌):
మంథని పట్టణంలో కమాన్‌పూర్, మంథని, రామగిరి, ముత్తారాం, పాలకుర్తి మండలాలకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సర్ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలి. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి” అని సూచించారు.

అతను మరింతగా, “ప్రతి ఇంటిని చేరుకొని ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలి. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా కాపాడడమే మా లక్ష్యం” అని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!