Sunday, July 19, 2026
HomeSportస్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు

స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు

📰 Generate e-Paper Clip

  • జూలై 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్స్
  • అర్హులైన క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఓలేటి జ్యోతి

మహబూబాబాద్, జూలై 18(చైతన్యగళం):
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రాంతీయ క్రీడా వసతి గృహాలు, వివిధ స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి డాక్టర్ ఓలేటి జ్యోతి తెలిపారు.

అర్హత కలిగిన బాలురు, బాలికలు తమ క్రీడా ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఎంపికలకు హాజరయ్యే అభ్యర్థులు క్రీడా సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రం, స్టడీ సర్టిఫికెట్లు, 10 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, సంబంధిత అన్ని ఒరిజినల్ పత్రాలతో పాటు జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని సూచించారు.

వాలీబాల్ అకాడమీ (సిద్ధిపేట)లో బాలురు, బాలికలకు జూలై 22, 23 తేదీల్లో ఎంపికలు జరుగుతాయని తెలిపారు. ఇందుకు 30 జూన్ 2010 నుంచి 1 జూలై 2012 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. అలాగే రాజన్న సిరిసిల్లలో సైక్లింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో రెజ్లింగ్, ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, హనుమకొండ జేఎన్‌ఎస్ స్టేడియంలో జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో హాకీ, హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో హ్యాండ్‌బాల్ విభాగాలకు ఆయా తేదీల్లో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అభ్యర్థులు సంబంధిత కేంద్రాలకు ఎంపికల తేదీల్లో ఉదయం 8 గంటలకు అవసరమైన పత్రాలతో హాజరు కావాలని సూచించారు.

ఎంపికలపై మరిన్ని వివరాలకు జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయం లేదా 94406 30681 నంబర్‌ను సంప్రదించవచ్చని డాక్టర్ ఓలేటి జ్యోతి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!