Wednesday, July 15, 2026
Homeతెలంగాణకుల బాంధవులకు సేవ చేయడమే సంఘం కర్తవ్యం – జడల సురేందర్

కుల బాంధవులకు సేవ చేయడమే సంఘం కర్తవ్యం – జడల సురేందర్

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి, జూలై 14 (చైతన్యగళం): పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్కు చెందిన మున్నూరు కాపు కుల బాంధవుడు వైద లింగన్న కుమారుడు వైద లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో స్థానిక మిత్రులు, కుల సోదరులు, జిల్లా మున్నూరు కాపు సంఘం కలిసికట్టుగా స్పందించి కుటుంబానికి రూ.42,000 ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జడల సురేందర్ మాట్లాడుతూ, “ఆపదలో ఉన్న కుల బాంధవులకు సేవ చేయడమే సంఘం యొక్క ప్రధాన కర్తవ్యం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో అందుగులపల్లెలో ఇల్లు కూలిపోయిన బాధితులకు సహాయం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో ఎక్కడైనా కుల సోదరులకు ఆపద వచ్చినా సంఘం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్. రాజయ్య మాట్లాడుతూ, “వైద లక్ష్మణ్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాం. సుభాష్ నగర్ కుల సోదరులు ఒక్క రోజులోనే రూ.42,000 సేకరించడం గొప్ప విషయం. స్థానిక నాయకులు ముందడుగు వేస్తే, జిల్లా సంఘం తరపున మేము అండగా నిలుస్తాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ నుగిళ్ళ మల్లయ్య, రాష్ట్ర నాయకులు అమీరిశెట్టి రామస్వామి, ఉనుకొండ శ్రీధర్, జిల్లా నాయకులు పూదరి శ్రీనివాస్, ఉప్పు రాజ్ కుమార్, అమ్మిరిశెట్టి పూర్ణచందర్, స్వామి వివేక్ పటేల్, కొమిరిశెట్టి కనకయ్య, గండు రంగయ్య, ఉనుకొండ వైకుంఠం, సొల్లూరి రాజిరెడ్డి, వెన్నం రవీందర్, ఉనుకొండ రాజు, ఉనుకొండ భూమయ్య, దేవానంది శ్రీనివాస్, ఉప్పు రమేష్, కల్వల శ్రీనివాస్, తూముల రాజేశం, తూముల రవితేజ పటేల్, గండు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!