Wednesday, August 5, 2026
Homeతెలంగాణఘనంగా ఎంపీ మల్లు రవి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీ మల్లు రవి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

వెల్దండ, జూలై 14 (చైతన్యగళం): వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు భూపతి రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఎంపీ మల్లు రవి నిబద్ధత, క్రమశిక్షణ, నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. ప్రజల క్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే దూరదృష్టి గల నాయకుడు” అని కొనియాడారు.

జన్మదిన వేడుకల్లో డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలు భాగ్యమ్మ ఫూల్ సింగ్ నాయక్, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్, నాయకులు కృష్ణ ముదిరాజ్, తిరుపతి రెడ్డి, పుల్లయ్య, వార్డు సభ్యులు గుద్దేటి కిష్టాల్, ముదిగొండ రమేష్, యువ నాయకులు నరసింహ, చందు నాయక్, సక్రు నాయక్, గజిని శ్రీను, కడారి శ్రీనివాస్ యాదవ్, ఈదులపల్లి శ్రీనివాసులుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!