ఘనంగా ఎంపీ మల్లు రవి జన్మదిన వేడుకలు

వెల్దండ, జూలై 14 (చైతన్యగళం): వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు భూపతి రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు...